logo

Telangana News: ఉపాధ్యాయిని అవయవదానం.. ఐదుగురి జీవితాల్లో వెలుగులు

ఒక ఉపాధ్యాయురాలి అవయవదానం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. సంస్థాన్‌ నారయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి(45) హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ఎల్లారెడ్డికాలనీలో నివాసించేవారు.

Updated : 25 Jun 2022 06:45 IST

విజయలక్ష్మి

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: ఒక ఉపాధ్యాయురాలి అవయవదానం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. సంస్థాన్‌ నారయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి(45) హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ ఎల్లారెడ్డికాలనీలో నివాసించేవారు. నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఈ నెల 21న ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబీకులు మలక్‌పేట యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు. రెండు రోజుల పాటు వైద్యం అందించిన అక్కడి డాక్టర్లు.. ఆమె బ్రెయిన్‌డెడ్‌(జీవన్మృతురాలు) అయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ వైద్య బృందం విజయలక్ష్మి భర్త నర్సింహారెడ్డి, కుమారుడు దినేష్‌రెడ్డి, కుమార్తె మౌనిక రెడ్డి, ఇతర కుటుంబీకులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో విజయలక్ష్మి నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కంటి కార్నియాలను సేకరించారు. అనంతరం వాటిని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు అమర్చినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ స్వర్ణలత వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని