logo

లోక్‌ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.గౌతంప్రసాద్‌ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో

Published : 26 Jun 2022 02:33 IST

న్యాయమూర్తి గౌతంప్రసాద్‌

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.గౌతంప్రసాద్‌ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో ఆదివారం లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తున్న విషయం విదితమే. న్యాయమూర్తి శనివారం మాట్లాడుతూ వివాదాల సత్వర, శాశ్వత పరిష్కారానికి లోక్‌ అదాలత్‌లే సరైన వేదికలన్నారు. కక్షిదారులు తమ కేసులను లోక్‌ అదాలత్‌లలో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, ధనాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌లలో కేసులు పరిష్కరించుకున్నట్లయితే ఇప్పటికే చెల్లించిన కోర్టు ఫీజులు తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. లోక్‌ అదాలత్‌ల ద్వారా జారీ చేసే అవార్డులు అప్పీలు లేని అంతిమ తీర్పులని న్యాయమూర్తి తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌లలో మోటారు వాహన ప్రమాదాల క్లయిములు, భూ పరిహారం కేసులు, భూవివాదాలతోపాటు రాజీపడ దగ్గ అన్ని క్రిమినల్‌ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాలతో ఈ లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపిన న్యాయమూర్తి కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని