logo

‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు’

నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల హక్కులను కాలరాస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించారని, అవి భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 47ఏళ్లు అయిన

Published : 26 Jun 2022 02:33 IST

భువనగిరిలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిని సన్మానిస్తున్న భాజపా జిల్లా

అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు

భువనగిరి, న్యూస్‌టుడే: నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల హక్కులను కాలరాస్తూ దేశంలో ఎమర్జెన్సీ విధించారని, అవి భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 47ఏళ్లు అయిన సందర్భంగా స్థానిక మనోహర ఫంక్షన్‌హాల్‌లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పాల్గొన్న వారిని శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమర్జెన్సీ ప్రకటించి దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను జైలుపాలు చేశారన్నారు. అనంతరం హైదరాబాద్‌లో జులై 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ సన్నాహక సమావేశం పట్టణ అధ్యక్షుడు పాదరాజు ఉమాశంకర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాని సభను విజయవంతం చేయాలని, ఇందుకు జనసమీకరణకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి నందకుమార్‌ యాదవ్‌, పోతంశెట్టి రవీందర్‌, దాసరి మల్లేశం, నర్ల నర్సింగ్‌రావు, పడమటి జగన్‌మోహన్‌రెడ్డి, చందా మహేందర్‌ గుప్తా, నీలం రమేశ్‌, రత్నపురం బలరాం, కొండం ఉపేందర్‌గౌడ్‌, సుర్వి లావణ్య, నరసింహాచారి, బద్దం బాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని