logo

చర్లగూడెం నిర్వాసితుల ఆందోళన

మర్రిగూడ మండలం చర్లగూడెం జలాశయం ముంపు గ్రామాల భూ నిర్వాసితులకు పునరావాసం చెక్కులు న్యాయంగా అందలేదని శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో తహసీల్దా

Published : 26 Jun 2022 02:33 IST

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితులు

మర్రిగూడ, న్యూస్‌టుడే: మర్రిగూడ మండలం చర్లగూడెం జలాశయం ముంపు గ్రామాల భూ నిర్వాసితులకు పునరావాసం చెక్కులు న్యాయంగా అందలేదని శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో తహసీల్దార్‌ తమ విధులను ముగించుకొని వెళ్తున్న సమయంలో మహిళలు ఆమెను అడ్డుకున్నారు. కార్యాలయం గేటు దగ్గర ఆమెను నిలువరించారు. తమకు అందాల్సిన పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని నిర్వాసితులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ పెట్రోల్‌ పోసుకుంటానని ప్రయత్నించడంతో స్థానిక ఎస్సై వెంకట్‌రెడ్డి నివారించారు. అందరికి న్యాయం చేస్తామని, ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్‌ సంఘమిత్ర రైతులకు సూచించారు.

పోలీసులు దాడి చేశారని మహిళల ఆరోపణ

పోలీసులు తమపై దాడి చేశారని, మహిళలు ఆరోపించారు. ఎస్సై వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా తాము అడ్డుకున్నామే గాని ఎవరిపై దాడి చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ సంఘమిత్రను వివరణ కోరగా తనపై ఎలాంటి దాడి జరగలేదని, మహిళల ఆందోళనను శాంతింపజేయడంలో భాగంగానే పోలీసులు వారిని నివారించారని తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని