logo

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి: కలెక్టర్‌

నల్గొండలో చేపట్టిన రోడ్ల విస్తరణ, కూడళ్లు, పార్కుల సుందరీకణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం  చర్లపల్లి అర్బన్‌పార్కు, రోడ్ల విస్తరణ, బ్రిడ్జి, డ్రైనేజీ, దేవరకొండ రోడ్డులో కొనసాగుతున్న

Published : 26 Jun 2022 02:33 IST

పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అధికారులు

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: నల్గొండలో చేపట్టిన రోడ్ల విస్తరణ, కూడళ్లు, పార్కుల సుందరీకణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం  చర్లపల్లి అర్బన్‌పార్కు, రోడ్ల విస్తరణ, బ్రిడ్జి, డ్రైనేజీ, దేవరకొండ రోడ్డులో కొనసాగుతున్న జాతీయరహదారుల పనులు, సమీకృత మార్కెట్‌ నిర్మాణ, రాంనగర్‌ పార్కు సుందరీకరణ పనులను పరిశీలించారు. రోడ్ల విస్తరణ పనులను రాత్రి, పగలు సిఫ్టు పద్ధతిలో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మర్రిగూడ కూడలిలో మొక్కలను ఎక్కువ నాటాలన్నారు. కేంద్రీకృత డీవైడర్ల మధ్యలో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. స్తంభాల మార్పిడి ప్రక్రియ వేగవంతం చేసి టవర్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రమణాచారి, విద్యుత్తు సంస్థ డీఈ విద్యాసాగర్‌, మున్సిపల్‌ ఈఈ శ్రీనివాస్‌, డీఈలు వెంకన్న, అశోక్‌, నర్సింహారెడ్డి, ఏసీపీ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్‌ స్వగృహ గృహాల వేలానికి నేడు చివరి రోజు

నీలగిరి: రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌ షిప్‌లో వివిధ దశలలో ఉన్న గృహాలు, ఓపెన్‌ ప్లాట్ల భౌతిక వేలానికి ఆదివారం చివరిరోజు అని.. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కలెక్టర్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌ లో శ్రీవల్లీ టౌన్‌ షిప్‌ రెండోవిడత భౌతిక వేలంలో భాగంగా 6వ రోజు ఓపెన్‌ ప్లాట్లు పాక్షిక నిర్మాణం చేపట్టిన గృహాల వేలం పాట నిర్వహించారు. ప్రభుత్వమే అన్ని అనుమతులతో అభివృద్ధి చేసిన వెంచర్లలో మౌలిక సదుపాయాలు వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి రూ. 4.81లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.  సర్వే అండ్‌ ల్యాండ్స్‌ రికార్డ్సు ఏడీ శ్రీనివాసులు, సీపీవో బాలశౌరి, డీపీవో విష్ణువర్ధన్‌రెడ్డి, రాజీవ్‌స్వగృహ ప్రాజెక్టు మేనేజర్‌ షఫీయుద్దీన్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని