logo

అరకొరగా పుస్తకాలు.. విద్యార్థుల అవస్థలు

ప్రభుత్వం వేసవి సెలవుల అనంతరం జూన్‌ 13 నుంచి పాఠశాలలు ప్రారంభించింది. కొత్త విద్యా సంవత్సరం(2022-23) ప్రారంభమైనా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి

Published : 26 Jun 2022 02:33 IST

సూర్యాపేట గోదాములో ఉచిత పాఠ్యపుస్తకాలు

సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), భువనగిరి పట్టణం,  వలిగొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వం వేసవి సెలవుల అనంతరం జూన్‌ 13 నుంచి పాఠశాలలు ప్రారంభించింది. కొత్త విద్యా సంవత్సరం(2022-23) ప్రారంభమైనా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ, జడ్పీ, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, పలు శాఖల ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరకొరగానే పుస్తకాలు చేరాయని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. వచ్చిన పుస్తకాలు ఏయే తరగతులవనే విషయంపై అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి స్థాయిలో వచ్చాకనే పంపిణీ చేస్తామని పేర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో పుస్తకాలు లేకుండానే విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పూర్తి స్థాయిలో వచ్చాకే పంపిణీ

- అశోక్‌ డీఈవో సూర్యాపేట

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పూర్తి స్థాయిలో వచ్చాకే పంపిణీ చేస్తాం. ఈసారి ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన చేపట్టనున్న నేపథ్యంలో ద్విభాషా పద్ధతిలో(ఆంగ్ల, తెలుగు మాధ్యమం) ముద్రణ వల్ల కొంత వరకు ఆలస్యమైంది. ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెలాఖారు కల్లా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు విద్యార్థులు నష్టపోకుండా పాత పుస్తకాలతో బోధన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని