logo

Telangana News: మూసీకి పోటెత్తిన వరద.. మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు

Published : 27 Jun 2022 10:36 IST

నల్గొండ: గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1247.79 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ ఫ్లో 1992.74 క్యూసెక్కులుగా ఉంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 644.61గా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 4.36 టీఎంసీల నీరు ఉంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని