logo

పౌరసేవ.. ఆన్‌లైన్‌ తోవ

పురపాలికల్లో ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించేలా ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ ద్వారా పౌరసేవలు అందించేందుకు పురపాలిక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Published : 28 Jun 2022 04:55 IST

మిర్యాలగూడ, న్యూస్‌టుడే


మిర్యాలగూడ పురపాలిక కార్యాలయం

పురపాలికల్లో ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించేలా ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ ద్వారా పౌరసేవలు అందించేందుకు పురపాలిక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పౌరసేవా కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పురపాలికల్లో అధికారులు ఈ తరహా పౌరసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత పురపాలికల్లో మేనేజర్‌లు ఉండగా , కొత్త పురపాలికల్లో రెవెన్యూ విభాగం వారికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉండే వారు సైతం తమ ఇళ్లకు సంబంధించిన సమస్యలు నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయొచ్ఛు పురపాలిక కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. నేరుగా సెల్‌ఫోన్‌లోనే ఫిర్యాదు చేస్తే నిర్ణీత సమయంలో పరిష్కరిస్తారు. దీన్ని పురపాలిక ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. దీంతో కింది స్థాయి సిబ్బంది సకాలంలో స్పందించి సమస్య పరిష్కరిస్తారు.

రాష్ట్రస్థాయిలో ‘ఈ మున్సిపల్‌ డాట్‌ తెలంగాణ డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌’ వెబ్‌సైట్‌తో అన్ని పురపాలికలను అనుసంధానించనున్నారు. ఈ బాధ్యతను వీ- మాక్స్‌ ఈసొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారికి అప్పగించారు. ప్రతి పురపాలికలో మేనేజర్‌లను నోడల్‌ అధికారులుగా, కంప్యూటర్‌ నైపుణ్యమున్న వారిని సహాయ నోడల్‌ అధికారిగా నియమిస్తారు. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసి అందులో ఆయా పురపాలికల పూర్తి సమాచారం పొందుపరచాలని సూచించారు. పురపాలిక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యుల వివరాలు ఫొటోలతో సహా నమోదు చేయాలి. అమృత్‌ పట్టణాలైతే వాటి నిధుల సమాచారం పేర్కొనాలి. పురపాలికల్లో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేయాల్సిన వివరాలు, పురపాలికల్లో జరిగే టెండర్ల సమాచారం ఇందులో ప్రదర్శిస్తారు.


ప్రజలకు సత్వర సేవలు

రవీందర్‌ సాగర్‌, కమిషనర్‌

పట్టణాల్లో వార్డుల సమస్యలు పురపాలిక కార్యాలయం వరకు వచ్చి ఫిర్యాదు చేసే అవసరముండదు. నేరుగా తమ ఫోన్‌లో ఫిర్యాదు చేయొచ్ఛు రాత్రి సమయంలో చేసిన ఫిర్యాదులు ఉదయం సంబంధిత పారిశుద్ధ్య, నీటి సరఫరా, విద్యుత్తు సిబ్బంది స్పందించే అవకాశముంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెబ్‌సైట్‌ రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని