logo

చిత్రకళ.. భళా

గుండ్లగూడెం గ్రామానికి చెందిన బాల్నె శ్రీనివాస్‌ చిత్రకళ అంటే ప్రాణం.దానిని ఉపాధిగా మలుచుకొని రాజపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చిత్రకళ ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొంది రాణిస్తున్నారు.

Published : 28 Jun 2022 04:55 IST

శ్రీనివాస్‌ చేతిలో రూపుదిద్దుకున్న నీటి రంగులతో పురాతన పిల్లర్‌ కట్టడం, రాధాకృష్ణుల చిత్రాలు

రాజపేట, ఆలేరు, న్యూస్‌టుడే: గుండ్లగూడెం గ్రామానికి చెందిన బాల్నె శ్రీనివాస్‌ చిత్రకళ అంటే ప్రాణం.దానిని ఉపాధిగా మలుచుకొని రాజపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చిత్రకళ ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొంది రాణిస్తున్నారు. ముఖ్యంగా ప్రకృతి రమణీయతను తన కుంచెతో మలవడం, పెన్సిల్‌ ఆధారంగా ఆకట్టుకొనే చిత్రాలు గీయడం ఈయన ప్రత్యేకత. అంతేగాక కాన్వాస్‌పై నీటి రంగులు కుంచెతో అలవోకగా తమచేతిని జులిపిస్తూ చిత్రాలకు ప్రాణం పోయడంలో దిట్ట.


పెన్సిల్‌తో గీసిన వినాయకుడు, లాంతర్‌, శునకం చిత్రాలు

అద్భుతమైన చిత్రాలకు రూపకల్పన... బాల్నె శ్రీనివాస్‌కు చిన్నప్పటినుంచి చిత్రకళ అంటే అమితమైన ప్రాణం. గుండ్లగూడెంలో ప్రాథమిక విద్య నేర్చుకునే సమయంలో చిత్రకళ ఉపాధ్యాయుడు చింతమల్ల చంద్రయ్య వద్ద ఆ రంగంపై మెలకువలు నేర్చుకున్నారు. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ) జెన్‌టీయూలో అప్లైయిడ్‌ ఆర్ట్స్‌ విభాగంలో డిగ్రీ పట్టా పొందారు. నాలుగేళ్లపాటు చిత్రకళ రంగంలో రకరకాల ప్రయోగాలు చేపడుతూ కళాశాల అధ్యాపకులతో పలు పర్యాయాలు అభినందనలు పొందారు. శ్రీనివాస్‌. ముఖ్యంగా శ్రీనివాస్‌కు పెన్సిల్‌ ద్వారా బొమ్మలకు జీవం పోయడం ప్రత్యేకత. పలు చిత్రాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు, ప్రోత్సాహకాలు అందుకున్నారు. శ్రీనివాస్‌కు గోల్కొండ కోటను పెన్సిల్‌ ద్వారా గీసిన చిత్రానికి కళాశాల ప్రిన్సిపల్‌ ప్రత్యేకంగా అభినందించడం విశేషం. సమ్మర్‌ సమూరాయ్‌ కార్యక్రమంలో తమ పాఠశాల చిన్నారులు చిత్రకళలో అద్భుతమైన ప్రతిభ చాటి ప్రశంసలు పొందడం ఆనందం కలిగిందన్నారు.


బాల్నె శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని