logo

పశువులను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్‌

అనుమతులు లేకుండా పశువులను తరలిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

Published : 28 Jun 2022 04:55 IST


సూర్యాపేటలో మాట్లాడుతన్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట పట్టణం: అనుమతులు లేకుండా పశువులను తరలిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పశువుల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా పశువులను రవాణా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా ఉంటుందన్నారు. పశువుల వధ నిషేధమని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి శ్రీనివాస్‌రావు, జడ్పీ సీఈవో సురేష్‌, డీపీవో యాదయ్య, డీఎఫ్‌వో ముకుందారెడ్డి, డీఎస్పీ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట పట్టణం: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సత్వరం స్పందించాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించారు. డీఆర్వో రాజేంద్రకుమార్‌, ఏవో శ్రీదేవి, పర్యవేక్షకుడు పులి సైదులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని