logo

పదిలో మెరిశారు..

పది పరీక్షల్లో నల్గొండ జిల్లా 93.57 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 19747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 18477 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి జిల్లాలోని అన్ని యజమాన్యాల నుంచి 461 మంది పది జీపీఏ సాధించడం

Published : 01 Jul 2022 05:37 IST

జిల్లాలో 461 మంది విద్యార్థులకు 10 జీపీఏ

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే

ది పరీక్షల్లో నల్గొండ జిల్లా 93.57 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 19747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 18477 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి జిల్లాలోని అన్ని యజమాన్యాల నుంచి 461 మంది పది జీపీఏ సాధించడం గమనార్హం. ఈ లెక్కన ఉత్తీర్ణులైన వారిలో 2.49 శాతం మంది 10 జీపీఏ సాధించారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 3.17 శాతం ఉండటం గమనార్హం. బాలురు 10273 మంది హాజరుకాగా 92.05శాతంతో 9456 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9474 మంది హాజరుకాగా 95.22 శాతంతో 9021 మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని అన్ని యజమాన్యాల ఫాఠశాలల నుంచి 461 మంది 10జీపీఏ సాధించారు. జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 9 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 21 మంది, బీసీ సంక్షేమ శాఖ పాఠశాలల్లో 40 మంది, ఆదర్శ పాఠశాలల నుంచి 10 మంది, మైనార్టీ గురుకులాలల నుంచి 5 గురు, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల నుంచి 20 మంది, గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి 6 గురు, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 350 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.


ఉత్తమ ఫలితాలు సాధించారు
- బి.భిక్షపతి (జిల్లా విద్యాశాఖాధికారి, నల్గొండ)

పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేకపోయినా ఈసారి మొదటి నుంచే పాఠశాల ప్రణాళికలు, ప్రత్యేక తరగతులు నిర్వహించడం వంటివి చేశాం. పరీక్షల కోసం అనుభవజ్జులచే స్టడీమెటీరియల్‌ రూపొందించాం. విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రత్యేక శ్రద్ధపెట్టాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పిల్లలు మంచి ఫలితాలు సాధించారు. 93.57 ఉత్తీర్ణత సాధించడంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇదే స్ఫూర్తితో ముందు ముందు మరింత మెరుగుగా విద్యాబోధన అందించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని