logo

బాలికలదే పైచేయి

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో గతంలో 12వ స్థానాన్ని కైవసం చేసుకున్న సూర్యాపేట జిల్లా ఈ సంవత్సరం వెనుకబడింది. జిల్లా నుంచి 93 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలోకి దిగజారింది. కొవిడ్‌కు

Published : 01 Jul 2022 05:37 IST

రాష్ట్రస్థాయిలో 16వ స్థానం  

సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో గతంలో 12వ స్థానాన్ని కైవసం చేసుకున్న సూర్యాపేట జిల్లా ఈ సంవత్సరం వెనుకబడింది. జిల్లా నుంచి 93 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలోకి దిగజారింది. కొవిడ్‌కు ముందు ఏడాదిలో 96 శాతంగా ఉత్తీర్ణత ఈ ఏడాది 93 శాతంగా అంటే 3 శాతం ఉత్తీర్ణత తగ్గింది. కరోనా పరిస్థితుల కారణంగా రెండేళ్లుగా పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. పాఠశాలలు దాదాపు రెండేళ్ల పాటు సరిగా పనిచేయకపోవడం, 2021-22 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం కూడా ఫలితాలపై ప్రభావం చూపిందని పలువురు విద్యానిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మాయిలు మెరిశారు..
ఫలితాల్లో 95.13 శాతం ఉత్తీర్ణతతో బాలుర కంటే బాలికలే ముందంజలో నిలిచారు. పరీక్షకు హాజరైన 12,443 మందిలో 11,572 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు- 6,347 మందికి 5,773 మంది, బాలికల్లో  6,096 మందికి 5,799 మంది ఉత్తీర్ణత సాధించారు. గరిష్ఠ మార్కులు సాధించడంలో ఎక్కువ మంది పోటీపడ్డారు. 107 పాఠశాలలు 100శాతం ఫలితాలను నమోదు చేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి మొత్తంగా 391 మందికి 10/10 జీపీఏ రావడం గమన్హారం.


ప్రత్యేక తరగతుల వల్లనే మెరుగైన స్థానం
- అశోక్‌ డీఈవో సూర్యాపేట జిల్లా

గత రెండేళ్లుగా కొవిడ్‌ ప్రభావంతో పాఠశాలలు నడవకపోయినప్పటికీ ఈసారి ఫలితాల్లో జిల్లా మెరుగైన స్థానం రావడం సంతోషకరం. ప్రత్యేక తరగతుల్లో విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నివృత్తి చేయడంతోనే మంచి ఫలితాలను సాధించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని