logo

చేపల పెంపకానికి ప్రణాళిక సిద్ధం

నీలి విప్లవం పేరిట చేపల పెంపకం, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతీ యేటా నూరుశాతం రాయితీతో జలాశయాల్లో చేప పిల్లలను వదులుతోంది. ఇందులో

Published : 01 Jul 2022 05:37 IST

కొలనుపాక పిన్న చెరువులో చేపలను వదులుతున్న దృశ్యం (పాతచిత్రం)

ఆలేరు, న్యూస్‌టుడే: నీలి విప్లవం పేరిట చేపల పెంపకం, మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతీ యేటా నూరుశాతం రాయితీతో జలాశయాల్లో చేప పిల్లలను వదులుతోంది. ఇందులో భాగంగా ఈసారి 3.16 కోట్ల చేప పిల్లలను చెరువులు, జలాశయాల్లో వదిలేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిశాక చేపపిల్లలను చెరువుల్లో జారవిడిచేందుకు జిల్లా మత్స్యశాఖ సిద్ధమైంది.

గతేడాది 654 చెరువుల్లో చేప పిల్లలను వేయడంతో మత్స్యకారుల పారిశ్రామిక సంఘాలకు మంచి ఆదాయం చేకూరింది.  ప్రస్తుత జూన్‌, జులై నెలల్లో చెరువుల్లోకి 80శాతం వర్షపు నీరు చేరుతుందని మత్స్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో ఎంపిక చేసిన చెరువుల్లో 3.16కోట్ల చేప పిల్లలు వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 13,765 టన్నుల చేపలు ఉత్పత్తి కానున్నాయని అంచనా వేశారు.


సీడ్‌ జారవేతకు చర్యలు

రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి, యాదాద్రి భువనగిరి
జిల్లాలో ఉన్న చెరువుల్లో ఎంపిక చేసిన వాటిలో చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురిశాక చెరువుల్లో చేప పిల్లలను వదులుతాం. మత్స్యకారుల పారిశ్రామిక సహకార సంఘాలకు మంచి ఆదాయం, ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని