logo
Updated : 06 Aug 2022 08:53 IST

Telangana News: రెండిళ్లు.. 20 రోజులు.. కరెంటు బిల్లు రూ.1,75,706

చింతపల్లి, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రెండు ఇళ్లకు ఏకంగా రూ.1,75,706ల కరెంట్‌ బిల్లులు రావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రానికి చెందిన నల్లవెళ్లి పుల్లయ్య ఇంటికి గత నెల 16 నుంచి ఈ నెల 5 వరకు 8672 యూనిట్లు రీడింగ్‌ తిరిగినట్లు రూ.87,338 బిల్లు వేశారు. నల్లవెళ్లి నిరంజన్‌ ఇంటికి 20 రోజులకు 8793 యూనిట్లు తిరిగినట్లు రూ.88,368 బిల్లు వేశారు. రెండు బల్బులు, ఒక ఫ్యాన్‌ ఉండగా రూ.వేలల్లో బిల్లులు ఎలా వేస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దళితులకు ఉచిత విద్యుత్తు అనే కారణంతో ఏళ్లుగా అధికారులు రీడింగ్‌ తీయలేదని.. ఇప్పుడు తమకు వేసిన బిల్లు చెల్లించాలంటే మా ఇల్లు అమ్మినా బకాయి తీరదని పుల్లయ్య కుమారుడు సైదులు వాపోయారు. అధికారులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని.. ఇంత బిల్లు రావడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు. దీనిపై ఏఈ శ్రీకాంత్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. గతంలో పని చేసిన సిబ్బంది నెలనెలా రీడింగ్‌ తీయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని.. సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.


తాము నివసిస్తున్న ఈ ఇంటికి రూ.87,338ల బిల్లు వచ్చిందంటూ
రసీదు చూపుతున్న పుల్లయ్య కుమారుడు సైదులు

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts