logo

మునుగోడులో కాంగ్రెస్‌దే విజయం: ఎంపీ ఉత్తమ్‌

మునుగోడు ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ విజయం నల్లేరు మీద నడకేనని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో భాజపా, తెరాసను ఓడించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Published : 12 Aug 2022 06:08 IST

విజయరాఘవాపురంలో పాదయాత్ర చేస్తున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

మునగాల గ్రామీణం, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ విజయం నల్లేరు మీద నడకేనని ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో భాజపా, తెరాసను ఓడించేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా గౌరవ్‌ పాదయాత్రలో భాగంగా గురువారం మునగాల మండలం రేపాల, విజయరాఘవాపురం, కలకోవ తదితర గ్రామాల్లో యాత్రలో పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, దేశ అభివృద్ధికి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య సంస్థల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన కాంగ్రెస్సేనని.. అందుకు ఎంతగానో గర్వపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పున్నం వెంకయ్యను సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్న యాదవ్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు అనురాధరావు, ఎంపీపీ ఎలక బిందు పాల్గొన్నారు.

కోదాడ, కోదాడ గ్రామీణం: దేశాన్ని ఐక్యం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. ఆజాదీ కా గౌరవ్‌ యాత్రలో భాగంగా గురువారం కోదాడ పట్టణం, మండల పరిధిలోని గణపవరం స్టేజి నుంచి గుడిబండలో పాదయాత్ర చేపట్టి మాట్లాడారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, పారా సీతయ్య, వరప్రసాద్‌రెడ్డి, రామారావు, వెంకటచారి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని