logo

జాతీయ పతాకం ఎగురవేసి ఐక్యత చాటాలి: విప్‌ సునీత

ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన 2కే ఫ్రీడమ్‌ రన్‌లో

Published : 12 Aug 2022 06:08 IST

యాదగిరిగుట్టలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్‌లో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ సునీత, పుర ఛైర్‌పర్సన్‌ సుధ, తదితరులు

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన 2కే ఫ్రీడమ్‌ రన్‌లో ఆమె పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యువకులు, విద్యార్థులు త్రివర్ణ పతాకాలు పట్టుకొని పరుగులు తీస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పురపాలిక అధ్యక్షురాలు సుధ, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధ, పట్టణ సీఐ సైదులు, ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే గొంగిడి సునీత గురువారం ఆత్మకూరు వచ్చారు. దారి మధ్యలో తెరాస మండల కార్యదర్శి బూడిద శేఖర్‌ నిర్వహిస్తున్న దుకాణంలో రాఖీలు కొనుగోలు చేశారు.

భువనగిరి పట్టణంలో పరుగు తీస్తున్న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

స్వాతంత్య్ర స్ఫూర్తి చాటడం గర్వకారణం

భువనగిరి నేరవిభాగం: స్వతంత్ర వజ్రోత్సవాల్లో అందరూ పాల్గొని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటడం గ్వరకారణమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరిలోని హైదరాబాద్‌ చౌరస్తాలో గురువారం ఉదయం నిర్వహించిన ఫ్రీడం రన్‌ను అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారితో కలిసి ఆయన ప్రారంభించారు. జాతీయ గీతం ఆలపించి జెండాలను చేతబూని పరుగు తీశారు. హైదరాబాద్‌ చౌరస్తా నుంచి జూనియర్‌ కళాశాల మైదానం వరకు పరుగు కొనసాగింది. కార్యక్రమంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, పుర ఛైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ ఛైర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌ నాగిరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని