logo

అత్యాచారాల నిరోధానికి పకడ్బంది చర్యలు

గ్రామీణ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి తీసుకొచ్చిన చట్టాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ

Published : 12 Aug 2022 06:08 IST

జాతీయ స్థాయి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, కలెక్టర్‌ పమేలా సత్పతి, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌రెడ్డి, తదితరులు

భువనగిరి, న్యూస్‌టుడే: గ్రామీణ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి తీసుకొచ్చిన చట్టాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ పమేలా సత్పతి అధ్యక్షతన గురువారం జరిగింది. గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారని, వారికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారాల నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారించాలని అధికారులను ఆదేశించారు. డివిజన్‌ వారీగా నమోదైన కేసులపై సమీక్షించారు. ప్రతి నెల పౌరహక్కుల దినం నిర్వహించాలని తీర్మానించారు. అత్యాచారాల నిరోధానికి జాతీయ స్థాయి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ గోడపత్రికను ఆవిష్కరించారు. జడ్పీ ఛైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎస్సీ అభివృద్ధి అధికారి జైపాల్‌రెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్‌, డీఏవో అనురాధ,  ఏసీపీ వెంకట్‌రెడ్డి, అనధికార సభ్యులు సుదర్శన్‌, కె.నర్సింగ్‌రావు, శివలింగం, తిరుమలేశ్‌, భాస్కర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. స్వాతంత్య్ర దిన వేడుకల ఏర్పాట్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్‌ సమీక్షించారు. నూతన కలెక్టరేట్‌ ఆవరణలోనే వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. సంక్షేమ శాఖలు తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. రుణాలు, ఆస్తుల పంపిణీకి సంబంధించి సంబంధిత శాఖలు ముందస్తుగా నివేదికలను సిద్ధం చేసుకొని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, చౌటుప్పల్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరాచారి, ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీపీవో మాన్యానాయక్‌, ఎస్‌ఈ అభివృద్ధి అధికారి జైపాల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యామ్‌సుందర్‌, డీఈవో నారాయణరెడ్డి, డీపీవో సుందన, డీఏవో అనురాధ, డీఎంహెచ్‌వో మల్లికార్జున్‌, మున్సిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, డీటీవో సురేశ్‌, విద్యుత్తు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని