logo

తిరంగా పరుగు

భారత సాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కే ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించారు. పోలీస్‌ మైదానంలో ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్‌ మీదుగా బాలుర జూనియర్‌ కళాశాల వరకు నిర్వహించారు. జిల్లా అధికారులు,

Published : 12 Aug 2022 06:13 IST

నల్గొండలో జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, మున్సిపల్‌ ఛైర్మన్‌ సైదిరెడ్డి, తదితరులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: భారత సాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కే ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించారు. పోలీస్‌ మైదానంలో ప్రారంభమైన ర్యాలీ గడియారం సెంటర్‌ మీదుగా బాలుర జూనియర్‌ కళాశాల వరకు నిర్వహించారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, పోలీసులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని పరుగు తీసి దేశభక్తి చాటుకున్నారు. ర్యాలీని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగరవేసి దేశ ఐక్యతను చాటాలని పిలుపు నిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్‌ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ రెమా రాజేశ్వరి, మున్సిపల్‌ ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, డీఎంహెచ్‌వో కొండల్‌రావు, జైలు సూపరింటెండెంట్‌ దేవ్‌లా, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, బండారు ప్రసాద్‌, గోలి మధుసూదన్‌రెడ్డి, డా.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని