logo

మహాత్ముడి మందిరం

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి పక్కన మహాత్మా గాంధీ ఆలయం నిర్మించారు. ‘మహాత్మా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో దాతలు అందించిన విరాళాలతో ఈ గుడిని నిర్మించారు.

Published : 15 Aug 2022 04:01 IST


గర్భగుడిలోని గాంధీ నల్లరాతి విగ్రహం

చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి పక్కన మహాత్మా గాంధీ ఆలయం నిర్మించారు. ‘మహాత్మా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో దాతలు అందించిన విరాళాలతో ఈ గుడిని నిర్మించారు. గుంటూరుకు చెందిన మోర శ్రీపాల్‌రెడ్డి ట్రస్టీగా, భూపాల్‌రెడ్డి గౌరవ అధ్యక్షుడిగా మరికొందరి దాతలతో కలసి 2004లో నరసరావుపేటలో ‘మహాత్మా చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశారు. పెద్దకాపర్తి శివారులో నాలుగు ఎకరాల భూమిలో 2012 అక్టోబర్‌ 2న భూమి పూజ జరిపి 2014 సెప్టెంబర్‌ 15న పై అంతస్తులో శాస్త్రోక్తంగా గాంధీ నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కింద జ్ఞాన మందిరం ఏర్పాటు చేశారు.

ఆలయం వద్ద గాంధీ వేషధారణలో విద్యార్థులు

పుణ్యక్షేత్రాల మట్టి... దేశంలోని 30 ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని సేకరించి గాజు పెట్టెలో పెట్టి గర్భగుడి చుట్టూ అమర్చారు. గాంధీ పుట్టిన గుజరాత్‌లోని పోరుబందర్‌, సబర్మతీ ఆశ్రమాల నుంచి తెచ్చిన మట్టిని భక్తుల దర్శనార్థం ఉంచారు. ఆలయం ముందు భాగాన 32 అడుగుల ధ్వజ స్తంభం ఏర్పాటు చేశారు. ఆలయాల్లో నంది విగ్రహం ఉండే చోట అశోక ధర్మచక్రం ఏర్పాటు చేశారు. హిందూ దేవాలయాల మాదిరిగానే ఈ గుడిలో నిత్య పూజలు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు