logo

‘అభివృద్ధిని పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డి’

ఎన్నికైన మూడున్నర సంవత్సరాలలో కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా నియోజవర్గ ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా స్వలాభం కోసం భాజపాకు అమ్ముడుపోయినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మర్రిగూడలో ఆదివారం

Updated : 15 Aug 2022 06:49 IST

సంస్థాన్‌ నారాయణపురంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

మర్రిగూడ, న్యూస్‌టుడే: ఎన్నికైన మూడున్నర సంవత్సరాలలో కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా నియోజవర్గ ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా స్వలాభం కోసం భాజపాకు అమ్ముడుపోయినట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మర్రిగూడలో ఆదివారం జరిగిన తెరాస కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫ్లోరైడ్‌ పీడిత మునుగోడు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంత బాధితులను చూసి చలించి పోయి మిషన్‌ భగీరథను తీసుకొచ్చారని, ఇంటింటికీ సురక్షిత నీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు శంకర్‌ అధ్యక్షత వహించగా ఎంపీ మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సురేందర్‌రెడ్డి, మాల్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ జగదీశ్‌, సర్పంచి యాదయ్య గౌడ్‌ పాల్గొన్నారు.

సంస్థాన్‌నారాయణపురం: మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్‌ఏ అభ్యర్థిగా భావించి ప్రతి కార్యకర్త పని చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సంస్థాన్‌నారాయణపురంలో ఆదివారం నిర్వహించిన తెరాస కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మునుగోడులో జరిగే ప్రజా దీవెన సభకు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, గాదరి కిశోర్‌లు కార్యకర్తలతో చర్చించారు. 2,3 గ్రామాలకు కలిపి ఇన్‌ఛార్జిలను నియమించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ సందీప్‌కుమార్‌, ఎంపీపీ ఉమాదేవి, జడ్పీటీసీ సభ్యురాలు  భానుమతి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు శివ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని