logo
Published : 17 Aug 2022 04:39 IST

మఫ్టీలో పోలీసుల హల్‌చల్‌

చౌటుప్పల్‌ ఎంపీపీ ఇంటికి అర్ధరాత్రి రాక


వెంకటరెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంటుకు వచ్చిన పోలీసులు

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: మన్సూరాబాద్‌ ఉంటున్న చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఇంటికి అర్ధరాత్రి సివిల్‌ డ్రస్‌లో పోలీసులు వచ్చి హల్‌చల్‌ చేయడంతో భాజపా నాయకులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, ఆ పార్టీ నాయకులు, వెంకట్‌రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంతకాలం తెరాసలో కొనసాగుతున్న వెంకట్‌రెడ్డి మన్సూరాబాద్‌లోని తంగ్రిళ్ల అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు సివిల్‌ డస్సులో వారి ఇంటికి వచ్చి తాము పోలీసులమని, వెంకట్‌రెడ్డితో మాట్లాడాలని కుటుంబసభ్యులను కోరారు. ఆయన ఇంట్లో లేరని రాత్రి సమయంలో ఇలా ఇంటికి రావడం ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న భాజపా నాయకులకు సమాచారం ఇవ్వడంతో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి  అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఇలా రావాల్సిన అవసరం ఏమిటని పోలీసులను ఆయన అడగడంతో... చౌటుప్పల్‌లో నమోదైన కేసులో మాట్లాడేందుకు వచ్చామంటూ, సరైన సమాధానం  ఇవ్వకుండానే వచ్చిన రెండు వాహనాలలో వెళ్లిపోయారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
* వెంకటరెడ్డి భాజపాలో చేరుతున్నట్లు సమాచారం రావడంతో ఆయనను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులు వచ్చి తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని సామ రంగారెడ్డి ఆరోపించారు. 

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని