logo

మునుగోడులో ప్రలోభాలు షురూ

సీఎం కేసీఆర్‌ మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా ప్రలోభాలకు తెర తీశారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. మంగళవారం

Published : 17 Aug 2022 04:39 IST


భాజపా నేత ఈటల రాజేందర్‌

మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా ప్రలోభాలకు తెర తీశారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. మంగళవారం చౌటుప్పల్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి(తెరాస)తో పాటు జడ్పీటీసీ మాజీ సభ్యుడు బుచ్చిరెడ్డి మేడ్చల్‌-మల్కాజిగిరి జిలా మేడ్చల్‌ శివారు పూడూరులోని ఈటల నివాసంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. ఎన్నికలున్నాయని మునుగోడులో ముఖఖ్యమంత్రి కేసీఆర్‌ సమస్యలు తెలుసుకొని.. పరిష్కరించే పనిలో పడ్డారన్నారు. తెరాస ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా.. వెలకట్టి వారిని చేజారకుండా ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. మునుగోడులో తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బండి సంజయ్‌ యాత్రలో తెరాస శ్రేణుల దాడులు చేస్తున్నారని.. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనుమతులు తీసుకొని నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి తెరాసకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అనంతరం కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని