logo

యాదాద్రీశుడి హుండీ ఆదాయం రూ.1.22 కోట్లు

యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలోని హుండీల్లో 14 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను మంగళవారం కొండపైన గల హరిత భవనంలో లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు రూ.1,22,51,653 రాగా, మిశ్రమ బంగారం

Published : 17 Aug 2022 04:39 IST


హుండీల్లోని నగదును లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలోని హుండీల్లో 14 రోజులుగా భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను మంగళవారం కొండపైన గల హరిత భవనంలో లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు రూ.1,22,51,653 రాగా, మిశ్రమ బంగారం 101 గ్రాములు, 2400 గ్రాములు లభించినట్లు ఈవో గీత తెలిపారు. ప్రవాస భారతీయుల ద్వారా అమెరికాకు చెందిన 362 డాలర్లు, యూఏఈ 45 దిరామ్స్‌, ఆస్ట్రేలియాకు చెందిన 285 డాలర్లు, ఒమన్‌కు చెందిన 100 బైసా, ఇంగ్లండ్‌కు చెందిన 30 పౌండ్స్‌, సింగపూర్‌కు చెందిన 24 డాలర్లు, 30 యూరోలు లభించాయని ఈవో పేర్కొన్నారు. ధర్మకర్త నరసింహమూర్తి, ఏఈవోలు రామ్మోహన్‌రావు, శ్రవణ్‌ పర్యవేక్షించారు.
నిత్యాకల్యాణం.. యాదగిరిగుట్ట: నిత్యపూజితులైన శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మంగళవారం ఆలయ ఆచారంగా కల్యాణోత్సవం జరిపారు. గజ వాహనోత్సవంలో కల్యాణమూర్తులుగా ఆర్జిత భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన నిత్యకైంకర్యాలు రాత్రి నిర్వహించిన శయనోత్సవంతో ముగిశాయి. సుప్రభాతంతో స్వయంభువులను మేల్కొల్పి నిజాభిషేకం చేపట్టారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ సుదర్శన హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం కొనసాగించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి వారికి తమలపాకులతో ప్రత్యేక అర్చన జరిపారు. ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మీదేవి కోటి కుంకుమార్చన నిర్వహించారు. అనుబంధ శివాలయంలో నిత్యారాధనలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని