logo

మునుగోడు తీర్పుతో రాజకీయాల్లో మార్పు

మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో మంగళవారం నిర్వహించిన అనుచరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 17 Aug 2022 04:39 IST

మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి


చౌటుప్పల్‌లో ఆర్థిక సాయం మునుగోడు తీర్పుతో రాజకీయాల్లో మార్పుచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వస్తుందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో మంగళవారం నిర్వహించిన అనుచరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ, నియంతృత్వ పాలనను అంతం చేయడానికే తాను పదవికి రాజీనామా చేసి పోరాడుతున్నట్టు తెలిపారు. ఈ నెల 21న మునుగోడులో భాజపా అగ్రనేత అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరుతున్నందున మద్దతునివ్వాలని కోరారు. తన తల్లి పేరిట నెలకొల్పిన సుశీలమ్మ ఫౌండేషన్‌ ద్వారా అంకిరెడ్డిగూడేనికి చెందిన వితంతువు దొడ్ల కవిత కుటుంబానికి రూ.2లక్షలు, మసీదుగూడెంలో మృతి చెందిన నిరుపేద రైతు అచ్చిరెడ్డి కుటుంబానికి రూ.1లక్ష, లింగోజీగూడేనికి చెందిన నిరుపేద వితంతువు బోసి సుగుణమ్మ కుటుంబానికి రూ.1లక్ష ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. జడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు ఉప్పు భద్రయ్య, మొగుదాల రమేశ్‌, ఉబ్బు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts