logo
Published : 17 Aug 2022 04:48 IST

ప్రేమ వివాహం.. నాలుగేళ్లకే భర్త మరణం

ఇద్దరు పిల్లలతో కుటుంబ పోషణకు కష్టం


భర్త నరేష్‌ చిత్రపటం, కుమారులతో సమీనా

వారిద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయం..ప్రేమ, వివాహానికి దారి తీశాయి. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కుమారులతో జీవనం హాయిగా సాగుతున్న తరుణంలో దేవుడు వారి జీవితాల్లో అగాథాన్ని నింపాడు. భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఇద్దరు చిన్న కుమారులతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

* మిర్యాలగూడ పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన కర్నాటి సావిత్రమ్మ-యాదయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నరేష్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ నాలుగేళ్ల క్రితం ఇంటి పక్కనే ఉండే సమీనాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న సిద్ధార్థ్‌, రెండు నెలల వయసున్న ప్రతీక్‌ ఉన్నారు. యాదయ్య పక్షవాతంతో ఎన్నో ఏళ్లుగా ఇంటికే పరిమితం కాగా..సావిత్రమ్మ బియ్యం మిల్లులో కూలీ పనిచేస్తున్నారు.

అంతు చిక్కని రోగంతో మృతి
నాలుగేళ్లుగా సాఫీగా సాగుతున్న వారి కుటుంబంలో ఎనిమిది నెలల క్రితం నుంచి సమస్యలు మొదలయ్యాయి. నరేష్‌ అంతుచిక్కని వ్యాధితో విరేచనాలు, వాంతులతో ఎనిమిది నెలల పాటు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. చికిత్స కోసం రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినా.. వ్యాధి నయం కాకపోగా.. నెల రోజుల క్రితం మృతి చెందారు. దీంతో సమీనా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇంట్లో కేవలం సావిత్రమ్మ మాత్రమే పని చేసి తీసుకొస్తున్న డబ్బు వారి కుటుంబ అవసరాలకు సైతం సరిపోక పోవడవంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి : - సమీనా, నరేష్‌ భార్య
ఇద్దరు పిల్లలు చిన్నవారే కావడంతో ఆసుపత్రులకు తీసుకెళ్లడం, వారికి పోషకాహారం అందించాల్సి రావడంతో ఖర్చులు భారమయ్యాయి. ఇంతకు ముందెన్నడూ నేను ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. ప్రస్తుతం అత్త సావిత్రమ్మ పని చేస్తేనే పూట గడుస్తోంది. అందరినీ పోషించడం ఆమెకు చాలా కష్టంగా ఉంది. నేను కూడా సాయం అందిస్తే కుటుంబానికి చేదోడుగా ఉంటుంది. పదో తరగతి వరకు చదువుకున్న నాకు కిరాణ దుకాణం ఏర్పాటుకు సహకరిస్తే జీవనోపాధి పొందుతాం.

మిర్యాలగూడ, మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని