logo

కాంట్రాక్టుల కోసమే సొంత పార్టీకి వెన్నుపోటు: కాంగ్రెస్‌

కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచి భాజపాలో చేరుతున్నారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ పార్లమెంటు సభ్యుడు

Published : 17 Aug 2022 04:48 IST

నాంపల్లిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి చిత్రంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు
మాధవి, చెరుకు సుధాకర్‌, చల్లమల్ల కృష్ణారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, మెదక్‌ పార్లమెంట్ ఇన్‌ఛార్జి
గాలి అనిల్‌కుమార్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, పున్న కైలాశ్‌ నేత,  పాల్వాయి స్రవంతి

నాంపల్లి, న్యూస్‌టుడే: కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుపోటు పొడిచి భాజపాలో చేరుతున్నారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీˆనియర్‌ నాయకులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లిలో మంగళవారం నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో తెరాస పార్టీ గాలి వీస్తుంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డికి 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం కట్టబెట్టారని పేర్కొన్నారు. కార్యకర్తల అభిమానాన్ని భాజపా, అమిత్‌షా వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. భాజపా, తెరాస నాయకులు కాంగ్రెస్‌ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా వంటిదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించి గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అనే నినాదాన్ని ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ నెల 20 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తారని, అదే రోజు రాజీవ్‌గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రతి గ్రామంలో పార్టీ జెండాలు ఎగురవేయాలని రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెదక్‌ పార్లమెంట్ ఇన్‌ఛార్జి గాలి అనిల్‌కుమార్‌, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపు మాధవి, పాల్వాయి స్రవంతి, నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్‌, పున్న కైలాశ్‌ నేత, చెరుకు సుధాకర్‌, చండూరు ఎంపీపీ కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని