logo

రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా: విప్‌ సునీత

ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత జన్మదిన వేడుకలను మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

Published : 17 Aug 2022 04:48 IST


యాదగిరిగుట్ట: జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే గొంగిడి సునీత కేకు తినిపిస్తున్న
ఆమె భర్త, టెస్కాబ్‌ ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, చిత్రంలో తెరాస నాయకులు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత జన్మదిన వేడుకలను మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా తెరాస శ్రేణులు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠ ద్వారం వద్ద పార్టీ శ్రేణులు, అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే సునీత కోశారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. అంతకుముందు ఉదయమే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పట్టణంలోని ఆమె నివాసం వద్దకు చేరుకొని పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వారి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకొన్నాక పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజపేట, ఆలేరు పట్టణాల్లో జరిగిన వేడుకల్లో స్వయంగా పాల్గొన్నారు. తనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన ఆలేరు ప్రజల రుణం తీర్చులేనిదని, రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని గొంగిడి సునీత అన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన ప్రజా దర్బార్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెరాస నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం, సంచుల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవాకార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో టెస్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్‌ గడ్డమీది రవీందర్‌, జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, పుర అధ్యక్షురాలు సుధ, తెరాస మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రాంరెడ్డి, నాయకులు పాపట్ల నరహరి, మిట్ట వెంకటయ్య, బీర్ల మహేశ్‌, శ్రీధర్‌, హేమేందర్‌ పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌.. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పలువురు ప్రముఖులు లేఖలు, చరవాణిల ద్వారా శుభాకాంక్షలు తెలపడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని