logo

ఫ్లోరైడ్‌ను పారదోలిన ఘనత కేసీఆర్‌దే: మంత్రి జగదీశ్‌రెడ్డి

మునుగోడు నియోజకవర్గంలో 15 శాతం అంగవైకల్యం ఉందంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో

Published : 18 Aug 2022 05:09 IST

మునుగోడులో లబ్ధిదారులకు పింఛన్ల కార్డును పంపిణీ చేస్తున్న జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డి

మునుగోడు,న్యూస్‌టుడే: మునుగోడు నియోజకవర్గంలో 15 శాతం అంగవైకల్యం ఉందంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు ఏళ్లలోనే ఫ్లోరైడ్‌ను విముక్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కుల మతాలు అనే భేదాలు లేకుండా కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టి పెళ్లి చేసే కుటుంబాలకు దేవుడిగా నిలిచారన్నారు. వితంతువులు, ఫైలేరియా, డయాలసిస్‌, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు ఇస్తూ అందుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, మిర్యాలగూడ, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్‌, ఆర్డీవో జగన్నాథరావు, డీఆర్‌డీఏ ఏపీడీ సరస్వతి, డ్వామా ఏపీడీ శైలజ, తదితరులు పాల్గొన్నారు.
చండూరు: చండూరు మండలం గట్టుప్పల గ్రామంలో మంజూరైన 173, తెరటుపల్లికి వచ్చిన 89 పింఛన్లను మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం గట్టుప్పలలో మంజూరు పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు కర్నాటి వెంకటేశం, సర్పంచి ఇడెం రోజా, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్తయ్య, తెరటుపల్లి సర్పంచి వీరమళ్ల శ్రీశైలం, అవ్వారి శ్రీనివాసులు, ఇడెం కైలాసం, చంద్రయ్య పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని