logo

అభివృద్ధి కోసమైతే కాంగ్రెస్‌ నుంచే పోటీ చేయాలి: మంత్రి జగదీశ్‌రెడ్డి

నియోజకవర్గ అభివృద్ధి కోసమైతే రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచే తిరిగి పోటీ చేయాలని కానీ స్వలాభం కోసం భాజపాలో చేరుతున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడులో ఈ నెల 20న నిర్వహించే

Published : 18 Aug 2022 05:09 IST

సభకు సంబంధించిన మ్యాప్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డికి చూపిస్తున్న టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరీ బాలమల్లు, పక్కన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, తదితరులు

మునుగోడు, న్యూస్‌టుడే: నియోజకవర్గ అభివృద్ధి కోసమైతే రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచే తిరిగి పోటీ చేయాలని కానీ స్వలాభం కోసం భాజపాలో చేరుతున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడులో ఈ నెల 20న నిర్వహించే కేసీఆర్‌ ప్రజా దీవెన సభ స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాలను వ్యాపారంగా మలుచుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కొత్తేమీ కాదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన మునుగోడు ప్రజల విశ్వాసాన్ని మోదీ, అమిత్‌షా వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీతోనే కోమటిరెడ్డి సోదరులు అభివృద్ధి చెందారన్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసమే ఈ ఉప ఎన్నికలు వస్తున్నాయన్నారు. తెరాసదే విజయమని భాజపా మూడో స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, తెరాస రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌, మండల అధ్యక్షులు బండ పురుషోత్తంరెడ్డి తదితరులు ఉన్నారు. సభ వేదిక ఏర్పాట్లను టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరీ బాలమల్లు పర్యవేక్షిస్తున్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని