logo

మునుగోడులో మండలాల వారీగా ఇన్‌ఛార్జులు

మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మంచి మెజార్టీతో విజయం సాధించాలని భాజపా స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఛైర్మన్‌ జి.వివేక్‌ వెంకటస్వామి అధ్యక్షతన మునుగోడు స్టీరింగ్‌ కమిటీ తొలి సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో

Published : 25 Sep 2022 06:26 IST

ప్రకటించిన భాజపా స్టీరింగ్‌ కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మంచి మెజార్టీతో విజయం సాధించాలని భాజపా స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఛైర్మన్‌ జి.వివేక్‌ వెంకటస్వామి అధ్యక్షతన మునుగోడు స్టీరింగ్‌ కమిటీ తొలి సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. ఇందులో పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్‌రెడ్డితో పాటు సభ్యులు ఈటల రాజేందర్‌, ఏపీ జితేందర్‌రెడ్డి, స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. మండల ఇన్‌ఛార్జులు, సహ ఇన్‌ఛార్జులను వేయాలని సభ్యులు సూచించగా జాబితా రూపొందించారు. సమావేశం అనంతరం స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ జాబితాను ప్రకటించి విలేకరులతో మాట్లాడారు. మునుగోడులో గెలిచేందుకే కేసీఆర్‌ గిరిజన బంధును ప్రకటించారని, ఏడాది క్రితం హుజూరాబాద్‌ ఎన్నికలప్పుడు ప్రకటించిన దళితబంధునే సక్రమంగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అవినీతి, కుటుంబ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికలప్పుడే ఫాంహౌస్‌ నుంచి వచ్చే ముఖ్యమంత్రి తర్వాత ప్రజల సమస్యలు మరిచిపోతారంటూ ధ్వజమెత్తారు.

ఇన్‌ఛార్జిలు, సహ ఇన్‌ఛార్జులు వీరే..

చౌటుప్పల్‌- కూన శ్రీశైలంగౌడ్‌ (సహ ఇన్‌ఛార్జులు- జిట్టా బాలకృష్ణారెడ్డి, కె.రాములు)
చౌటుప్పల్‌ మున్సిపాలిటీ- రేవూరి ప్రకాశ్‌రెడ్డి (సుభాష్‌ ఛందర్‌జీ, కర్నాటి ధనుంజయ)
నారాయణపూర్‌- ఎం.రఘునందన్‌రావు (రమేశ్‌రాథోడ్‌, కాసం వెంకటేశ్వర్లు)
మునుగోడు- చాడ సురేష్‌రెడ్డి (బొడిగ శోభ, రవికుమార్‌ యాదవ్‌)
చండూరు-టి.నందీశ్వర్‌గౌడ్‌ (వన్నాల శ్రీరాములు, అందె బాబయ్య)
చండూరు మున్సిపాలిటీ- ఎం.ధర్మారావు (విజయ్‌పాల్‌రెడ్డి, నాగూరావు నామాజిజి)
నాంపల్లి- ఏనుగు రవీందర్‌రెడ్డి (అందె శ్రీరాములు యాదవ్‌, రితేశ్‌ రాథోడ్‌)
మర్రిగూడెం- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (ఎర్రబల్లి ప్రదీప్‌రావు, తుల ఉమ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని