logo

నేటి నుంచి పూల జాతర

బతుకమ్మ సంబరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబరు 3 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో

Published : 25 Sep 2022 06:26 IST

కలెక్టరేట్‌లో బతుకమ్మతో వస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, పక్కనే సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఏవో అనురాధ, జిల్లా పరిశ్రమల మేనేజర్‌ శ్రీలక్ష్మి

భువనగిరి, న్యూస్‌టుడే: బతుకమ్మ సంబరాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబరు 3 వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు బతుకమ్మ సంబరాల షెడ్యూల్‌ను శనివారం ప్రకటించారు. ఈనెల 25న మున్సిపల్‌, విద్యుత్తు, మత్స్య, సంక్షేమశాఖలు, మెప్మా, 26న డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌, కార్మిక, యూత్‌, క్రీడల శాఖలు, మెప్మా, 27న ఈఈ (పీఆర్‌, ఐబీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ), మెప్మా, 28న విద్యాశాఖ, 29న రెవెన్యూ, కలెక్టరేట్‌, ఆర్డీవోలు, తహసీల్దార్లు, జిల్లా సివిల్‌సప్లై అధికారులు, దేవాదాయశాఖ, డీసీవో, సీఎస్‌ మేనేజర్‌, ఎఫ్‌పీ షాపుల డీలర్స్‌, 30న పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, ఫారెస్ట్‌, ఆర్టీవో, అక్టోబర్‌ 1న డీపీవో, సీపీవో, ఆర్టీసీ, 2న మహిళా, శిశు సంక్షేమశాఖ, పరిశ్రమలు, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో, 3న డీఆర్‌డీవో ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరపాలని ఆదేశించారు.

భువనగిరి: మహిళా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆవరణలో శనివారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కలెక్టర్‌ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. పౌష్టికాహారం, బాలికల సంరక్షణ, మాతాశిశు సంక్షేమంపై అవగాహన కల్పించేలా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సిబ్బంది రంగురంగుల ముగ్గులు వేసి, బతుకమ్మలు పేర్చి ఆడారు. మోత్కూరు ఐసీడీఎస్‌ విభాగం ఉద్యోగులు కూరగాయలు, ఆకుకూరలతో పేర్చిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. పోషణ విలువలు తెలియజేస్తూ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్‌ విజయకుమారి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, డీఏవో అనురాధ, జిల్లా ఉద్యాన అధికారిణి అన్నపూర్ణ, పరిశ్రమల శాఖ అధికారిణి శ్రీలక్ష్మీ, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సఖి, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని