logo

బీఎస్పీతోనే పేదల జీవితాల్లో మార్పు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

సమాజంలోని భాజపా, తెరాస, కాంగ్రెస్‌లాంటి ఆధిపత్య కులాల పార్టీలన్నీ ఒక్కటేనని, ఆస్తులను వాళ్లందరూ పంచుకుంటారని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రాజ్యాధికార యాత్ర రెండో విడతలో 120వ

Published : 25 Sep 2022 06:26 IST

లింగోజీగూడెంలో ప్రజలను కలిసి ఓటు వేయాలని కోరుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: సమాజంలోని భాజపా, తెరాస, కాంగ్రెస్‌లాంటి ఆధిపత్య కులాల పార్టీలన్నీ ఒక్కటేనని, ఆస్తులను వాళ్లందరూ పంచుకుంటారని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రాజ్యాధికార యాత్ర రెండో విడతలో 120వ రోజున చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలోని ఆయన శనివారం పర్యటించారు. తాళ్లసింగారంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడే కమ్మరి కొలిమిలో కార్మికుడితో కలిసి పని చేశారు. దళితరత్న సుక్క సుదర్శన్‌ ఇంటిని సందర్శించారు. లింగోజీగూడెంలో ప్రజలతో ముచ్చటించారు. లింగోజీగూడెంలో తమ చిన్నారికి నామకరణం చేయాలని ఓ తల్లి కోరగా.. ‘దళపతి’ అని పేరు పెట్టారు. పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో మాట్లాడుతూ.. పల్లెల్లోని పాఠశాలలకు సౌకర్యాలు లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం రూ.50 కోట్లతో ప్రగతి భవన్‌, రూ.1200 కోట్లతో సచివాలయం నిర్మించారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను రూ.లక్షలు ఎరవేసి కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. బహుజన రాజ్యంలోనే పేదల బతుకులు మారతాయన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చాక ప్రతి బహుజన కుటుంబానికి ఎకరం భూమి, పట్టా, అయిదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇది అమలు చేయకపోతే ఇక్కడే నన్ను చెట్టుకు వేలాడదీయాలని కోరారు. ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్‌ పాఠశాలను స్థాపిస్తామని తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, యాదగిరి, నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె లింగస్వామి, మహిళా నాయకురాళ్లు కత్తుల పద్మ, నర్ర నిర్మల, పరమేశ్‌, మస్కు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని