logo

స్వచ్ఛతలో మెరిసె.. పురస్కారం వరించె

దక్షిణ భారతదేశంలో 15వేల లోపు జనాభా కలిగిన పురపాలికలలో ఉత్తమ పురపాలికలుగా స్వచ్ఛ సర్వేక్షన్‌-2022 కింద జిల్లాకు చెందిన చిట్యాల, చండూరు, నేరేడుచర్ల పురపాలికలు ఎంపికయ్యాయి. ఈ మేరకు అక్టోబర్‌ ఒకటిన దిల్లీలో

Published : 25 Sep 2022 06:26 IST

చిట్యాల, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశంలో 15వేల లోపు జనాభా కలిగిన పురపాలికలలో ఉత్తమ పురపాలికలుగా స్వచ్ఛ సర్వేక్షన్‌-2022 కింద జిల్లాకు చెందిన చిట్యాల, చండూరు, నేరేడుచర్ల పురపాలికలు ఎంపికయ్యాయి. ఈ మేరకు అక్టోబర్‌ ఒకటిన దిల్లీలో రాష్ట్రపతి లేదా కేంద్రమంత్రి చేతులమీదుగా ఉత్తమ పురపాలిక పురస్కారాలను పుర కమిషనర్లు అందుకోనున్నారు.

చిట్యాలలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పురపాలిక నుంచి వాహనాలు ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి చెత్త సేకరించారు. వార్డులన్నింటినీ శుభ్రంగా ఉంచడం, దుకాణ సముదాయాల్లో పొడి, తడి చెత్త సేకరించారు. దుకాణదారులు, వినియోగదారులకు ప్లాస్టిక్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా మహిళల పొదుపు సంఘాల సభ్యులు, కళాకారులతో కూడిన ప్రచారం, ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వందశాతం బహిరంగ మలమూత్ర విసర్జనను నియంత్రించగలిగారు. దోమల నివారణకు బ్లీచింగ్‌, ఫాగింగ్‌ వంటి చర్యలు తీసుకున్నారు. అధికారులు, పాలకవర్గం, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే ఈ పురస్కారానికి ఎంపిక  సాధ్యమైందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చండూరు భేష్‌ ..

చండూరు, న్యూస్‌టుడే: స్వచ్ఛ భారత్‌ మిషన్‌(అర్బన్‌)లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్‌-2022 ర్యాంకింగ్‌లో చండూరు పురపాలిక అవార్డును గెలుచుకున్నట్లు కమిషనర్‌ వెంకట్రాం శనివారం తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అక్టోబరు 1న దేశ రాజధాని దిల్లీలో తల్కతోరా స్టేడియంలో పురపాలిక ఛైర్‌పర్సన్‌ తోకల చంద్రకళతో పాటు తనకు కలిపి పురస్కారం ప్రదానం చేస్తారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని