logo

వారోత్సవాలను జయప్రదం చేయండి: కలెక్టర్‌

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 1 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా

Published : 25 Sep 2022 06:26 IST

సూర్యాపేట: లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 1 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాలను జయప్రదం చేయాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం ఆయన గోడ పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. వారోత్సవాల్లో భాగంగా వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టంపై అవగాహన, జాతీయ వయో వృద్ధుల హెల్ప్‌లైన్‌ 14567 సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 30న గాంధీ పార్కు నుంచి మినీ ట్యాంక్‌ బండ్‌ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ, సూపరింటెండెంట్‌ హుస్సేన్‌, ఎఫ్‌ఆర్‌వో వినోద్‌ కుమార్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ సంపత్‌, వయో వృద్ధుల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.రామచంద్రారెడ్డి, జి.విద్యాసాగర్‌, హమీద్‌ ఖాన్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అదనపు సీట్లకు ఎంపిక.. సూర్యాపేట కలెక్టరేట్‌: బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద పాఠశాలల్లో 2022-23 సంవత్సరానికి ప్రత్యేకంగా కేటాయించిన అదనపు సీట్ల కోసం శనివారం కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిన ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ పాల్గొని మాట్లాడారు. ఎంపికైన విద్యార్థులు సకాలంలో పాఠశాల్లో చేరి, క్రమ శిక్షణతో చదువుకోవాలని సూచించారు. విద్యార్థులతోనే లాటరీ తీయించి ఎంపిక చేశారు. ఒకటో తరగతిలో 100, అయిదో తరగతిలో 170మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారిణి దయానంద రాణి, డీఈవో అశోక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని