logo

వయో వృద్ధులను విస్మరిస్తే కఠిన చర్యలు: కలెక్టర్‌

వయో వృద్ధులను విస్మరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వారోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు.

Published : 25 Sep 2022 06:26 IST

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, తదితరులు

నీలగిరి, న్యూస్‌టుడే: వయో వృద్ధులను విస్మరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వారోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయో వృద్ధుల రక్షణకు సీనియర్‌ సిటీజన్‌ యాక్టు- 2007లో తీసుకొచ్చారని, ఎలాంటి సమస్యవచ్చినా టోల్‌ ‌్రఫ్రీ నంబర్‌ 14567కు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా వృద్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సర్పంచులు, ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించేలా సంబంధిత శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, ఫీల్డ్‌ రెస్పాండ్‌ అధికారి నాగిరెడ్డి, సీనియర్‌ సిటీజన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సముద్రాల మల్లికార్జున్‌, సుదర్శన్‌రెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు.

దళిత బంధును పకడ్బందీగా అమలు చేయాలి

నల్గొండ కలెక్టరేట్‌: దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన దళిత బంధు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 517 మంది లబ్ధిదారులకు యూనిట్‌లు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్‌ చేయాలన్నారు. 17 మండలాల్లో 20 గ్రామాల్లో పథకం అమలుపై ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు సమకూరే ఆదాయాన్ని నెలనెలా నివేదికను అందించాలన్నారు. గొర్రెలు, పశువుల యూనిట్లకు సంబంధించి షెడ్‌ల నిర్మాణం పశువుల కొనుగోలు పూర్తి చేయాలని, వారికి పశు సంవర్థక శాఖ అధికారులు అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా నెలకొల్పుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు. అధికారులు కాళిందిని, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌రావు, సంగీత లక్ష్మి, సుచరిత, సురేశ్‌రెడ్డి, గోపిరాం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని