logo

ఆక్రమణల్లో ఏఎమ్మార్పీ కాల్వగట్లు

సుమారు 55 మేజరు కాల్వలతో పాటు 250 పైగా మైనర్‌ కాల్వలతో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఏఎమ్మార్‌ ప్రాజెక్టు కాల్వ గట్లకు ఆక్రమణదారుల బెడద పట్టుకుంది. భూసేకరణ సమయంలో రెవెన్యూ విభాగం సేకరించిన భూమి

Published : 26 Sep 2022 04:24 IST

గుర్రంపోడు, న్యూస్‌టుడే: సుమారు 55 మేజరు కాల్వలతో పాటు 250 పైగా మైనర్‌ కాల్వలతో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఏఎమ్మార్‌ ప్రాజెక్టు కాల్వ గట్లకు ఆక్రమణదారుల బెడద పట్టుకుంది. భూసేకరణ సమయంలో రెవెన్యూ విభాగం సేకరించిన భూమి పట్టాదారుల పేర్లను తొలగించి కాల్వలకు చెందిన భూమిగా నమోదు చేసింది. అయినా కాల్వల పక్కన ఉన్న రైతులు దారుల కోసం సేకరించిన భూమినే కబ్జా చేస్తున్నారు. కొందరు ఆక్రమించి హద్దురాళ్లు పాతుకుంటుండగా, మరికొందరు ఏకంగా కాల్వలనే తమ భూముల్లో కలిపేసుకుంటున్నారు. కాల్వలు కంపచెట్లల్లో పూడుకుపోతుండటంతో ఆక్రమణదారులకు అడ్డుచెప్పేవారు కరవయ్యారు.

కేసులు పెడుతున్నాం

కాల్వగట్లను ఆక్రమించినట్లు ఫిర్యాదులు వచ్చిన తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు కేసులు పెట్టి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటున్నాం. గుర్రంపోడు మండలంలో పలుచోట్ల ఆక్రమణదారులపై కేసులు పెట్టిన సందర్భాలున్నాయి. - శ్రీనివాసరావు, ఏఈఈ, నీటిపారుదలశాఖ గుర్రంపోడు డివిజన్‌

ఇది ఏఎమ్మార్పీ డి-24 పరిధిలోని కొప్పోలు గ్రామం పక్కగా ఉన్న మైనరు కాల్వ. తమ తోట మధ్యగా పోతోందంటూ ఓ రైతు పూర్తిగా కంచె పెట్టి కాల్వనే ఆక్రమించుకున్నారు. కాల్వ గట్టుమీదనే పెద్దగేటు ఏర్పాటు చేసుకోవటం చిత్రంలో చూడవచ్ఛు దీంతో ఆ కాల్వ వెంట పర్యవేక్షించే అవకాశమూ అధికారులకు లేకుండా పోయింది.

ఇది మొసంగి గ్రామం పరిధిలోని ఏఎమ్మార్పీ డి-19 కాల్వ. పూర్తిగా కంపచెట్లుతో నిండిపోయి ఉంది. అయితే దానిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పక్కనున్న పది గుంటల స్థలాన్ని కొని దాంతోపాటు మరో మూడు గుంటల కాల్వగట్టును ఆక్రమించి హద్దురాళ్లు పాతుకున్నారు. ఇలా కాలలను ఆక్రమించుకుని దున్నుకోవటం, కొందరు బోర్లు వేసుకుని పైపులైన్లు వేసుకోవటం కాల్వల వెంట అడుగడుగునా కనిపిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని