అవినీతి, ధర్మానికి మధ్య మునుగోడు ఉప ఎన్నిక: లక్ష్మణ్‌

మునుగోడు ఉప ఎన్నిక అవినీతికి, ధర్మానికి మధ్య జరిగే ఎన్నిక అని, అందులో భాజపా గెలుపు తథ్యమని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచి అక్టోబర్‌

Updated : 26 Sep 2022 06:21 IST

హాలియాలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ,

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌

నీలగిరి, హాలియా, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నిక అవినీతికి, ధర్మానికి మధ్య జరిగే ఎన్నిక అని, అందులో భాజపా గెలుపు తథ్యమని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచి అక్టోబర్‌ 2 గాంధీ జయంతి వరకు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం హాలియాలో ఆయన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నల్గొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఓట్ల కోసం తెరాస ప్రకటించిన అనేక పథకాలు అమలుకు నోచుకోవడం లేదని.. భూదందా, ఇసుక దందా తదితర అంశాల నుంచి ప్రజలను తప్పుదారి పట్టించడానికి జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. కాంగ్రెస్‌, తెరాస, ఎంఐఎం ఒకేవిధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలవడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం కంటే ప్రజలకు సేవ చేయడమే భాజపా ముఖ్య ఉద్దేశమని, దేశంలోని ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. ఆయుష్‌మాన్‌ భారత్‌ పేరుతో కేంద్రం ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని తెస్తే తెలంగాణలో కేసీఆర్‌ ఆ పథకాన్ని అమలుచేయకుండా తాత్సారం చేశారన్నారు. తద్వారా కరోనా బాధితులు కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని విమర్శించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి శ్రీధర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గార్లపాటి జితేంద్రకుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నర్సింహారెడ్డి, కిసాన్‌మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూధన్‌రెడ్డి, కంకణాల నివేదితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని