logo

ఆడిపాడి.. ఆనందంగా గడిపి..

మహిళలు బతుకమ్మ వేడుకలు ఏటా నిర్వహిస్తున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతున్నారు. వివిధ రకాల పూలు, రంగులు కొనుగోలు చేసి ఆకర్షణీయంగా కనిపించేలా బతుకమ్మలను తీర్చిదిద్దుతారు. ఆయా కాలనీల్లోని

Published : 26 Sep 2022 04:24 IST

సూర్యాపేట: బతుకమ్మ ఆడుతున్న మహిళలు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: మహిళలు బతుకమ్మ వేడుకలు ఏటా నిర్వహిస్తున్నారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడుతున్నారు. వివిధ రకాల పూలు, రంగులు కొనుగోలు చేసి ఆకర్షణీయంగా కనిపించేలా బతుకమ్మలను తీర్చిదిద్దుతారు. ఆయా కాలనీల్లోని మహిళలతో కలిసి సూర్యాపేటలోని సద్దుల చెరువు (మినీ ట్యాంకుబండ్‌) వద్దకు చేరుకుంటారు. అక్కడ పాటలు, కోలాటాలతో ఆనందంగా గడిపి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు.

ఏటా బతుకమ్మను పేర్చుతున్నా - కీర్తిప్రియ, సూర్యాపేట

బతుకమ్మ పండుగకు రెండ్రోజుల ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. మా ఊరి నుంచి తంగేడు పువ్వు తెప్పించుకుంటాను. వీటితోపాటు మార్కెట్‌కు వచ్చిన వివిధ రకాల పూలను కొని బతుకమ్మను పేర్చుతాను. బతుకుమ్మను ఏ ఆకృతిలో పేర్చాలని వివిధ రకాల పుస్తకాలు, పేపర్లను తిరిగేస్తాను. ఎంచుకున్న ఆకృతి వచ్చేలా రెండు గంటల పాటు శ్రమిస్తాను. ఏటా ఇలాగే చేస్తున్నాను. ్చ

తొమ్మిది రోజులూ సందడే: సుజాత, సూర్యాపేట

బతుకమ్మ పండుగ అంటే ఎంతో ఇష్టం. ఒక్కరోజు కూడా తప్పించకుండా తొమ్మిదిరోజులు బతుకమ్మ వేడుకలు జరుపుకొంటాను. మా చుట్టపక్కల కాలనీల్లోని మహిళలతో కలిసి కోలాటాలు, పాటలతో సందడిగా మారుతుంటుంది. మహిళల స్వీయగౌరవం పెంచేలా ప్రభుత్వం ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వటం అభినందనీయం.

పాటలతో అలరిస్తాం: ప్రవీణ, సూర్యాపేట

బతుకమ్మ పండుగ ప్రారంభమైందంటే తొమ్మిది రోజులపాటు కోలాట స్టెప్పులతో పాటలు పాడుతాను. పదిరోజుల ముందే పాటల పుస్తకాలు సేకరించుకొని సిద్ధమవుతాను. పెద్ద పెద్ద బతుకమ్మలతో మహిళలందరం ఒకచోట గుమిగూడి ఆడిపాడటం ఆనందంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని