ఉచిత ఎరువుల పంపిణీ హామీ విస్మరించిన కేసీఆర్: భాజపా
రైతు సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో అమలుకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకుంటున్నారని భారతీయ జనతా కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు.
మోత్కూరులో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాశ్‌రెడ్డి
మోత్కూరు, న్యూస్‌టుడే: రైతు సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో అమలుకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డుకుంటున్నారని భారతీయ జనతా కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. సేవాసప్త కార్యక్రమంలో భాగంగా మోత్కూరులో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సదస్సులో మాట్లాడారు. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, యంత్రాలపై రాయితీలు ఇస్తుండగా రాష్ట్రంలో అవేవీ అమలుకావటం లేదన్నారు. ‘రైతుబంధు’ పేరిట భూస్వాములు, ఉన్నత వర్గాలకే కేసీఆర్ మేలుచేస్తున్నారని చెప్పారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇస్తామన్న హామీని ముఖ్యమంత్రి విస్మరించారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి దాసరి మల్లేశం, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్రెడ్డి, కార్యవర్గసభ్యుడు పాశం భాస్కర్, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రామచంద్రయ్య, బొట్టు అబ్బయ్య, కె.నాగార్జున్‌రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, గౌరు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
[ 17-04-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు నామినేషన్లు స్వేకరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే తెలిపారు. -
రేషన్ ఈ- కేవైసీకి మరో అవకాశం.. త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారుల సూచన
[ 17-04-2024]
ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. -
అక్రమాలపై కన్ను..!
[ 17-04-2024]
కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకోవడంతో పాటూ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి సకాలంలో ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న మిల్లులపై అధికారులు కొరడా ఝులిపించారు. -
నిత్యం రక్తసిక్తం..!
[ 17-04-2024]
జాతీయ, ప్రధాన రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాహనాల అతివేగం, చోదకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒక్కరు చేసిన పాపానికి ఎందరో తనువు చాలిస్తున్నారు. -
ఇచ్చిన హామీలు అమలు చేస్తాం
[ 17-04-2024]
భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, భారాస, భాజపా అభ్యర్థులకు తమకు పోటీయే కాదని కాంగ్రెస్ భువనగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. -
అమ్మకానికి ఆడబిడ్డ.. అడ్డుకున్న పోలీసులు
[ 17-04-2024]
రెండో కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆర్థికంగా భారం అవుతుందని.. పిల్లలు లేని వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. -
బస్తాలు రాక.. లక్ష్యం నెరవేరక..!
[ 17-04-2024]
కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు రైస్‌మిల్లులకు బస్తాల సమస్య నెలకొంది. ఖరీఫ్ ధాన్యంతో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన బస్తాలకు కాప్రా పురుగు పట్టడంతో (సన్నని తెల్లపురుగు).. -
ఓటు బాణం సంధించు.. రామరాజ్యం స్థాపించు!
[ 17-04-2024]
ఈ లోకంలో సద్గుణ సంపన్నుడు ఎవరని నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించినప్పుడు 16 గుణాలు కలిగిన పరిపూర్ణుడు శ్రీరామచంద్రమూర్తే అన్నాడట. శ్రీరాముడు మానవుడిగా పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. -
శిక్షకులేరీ..?
[ 17-04-2024]
వేసవి ఎండలు మండుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సరదా కోసం ఈతకు వెళ్తున్నారు. చిన్నారులు వేసవి సెలవుల్లోనే ఈత నేర్చుకుంటారు. -
శ్రీస్వామి కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ప్రత్యేక పూజలు
[ 17-04-2024]
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
18న నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్
[ 17-04-2024]
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్‌రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్‌ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్‌నాథ్ సింగ్