logo

ఆస్తులను స్వాధీనం చేసుకునే వరకు పోరాటం: ఎంపీ ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌లో గతంలో లేఅవుట్ల ఏర్పాటు సందర్భంగా పురపాలికకు స్వాధీనం చేసి.. ప్రస్తుతం అన్యాక్రాంతమైన స్థలాలు స్వాధీనం చేసుకునే వరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని నల్గొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

Published : 30 Sep 2022 04:43 IST

హుజూర్‌నగర్‌లో వివాదాస్పద స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: హుజూర్‌నగర్‌లో గతంలో లేఅవుట్ల ఏర్పాటు సందర్భంగా పురపాలికకు స్వాధీనం చేసి.. ప్రస్తుతం అన్యాక్రాంతమైన స్థలాలు స్వాధీనం చేసుకునే వరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని నల్గొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అనంతరం ఆక్రమణకు గురైనట్లు చెబుతున్న స్థలాలు, స్థిరాస్తి వ్యాపారులు కోర్టుకు వెళ్లిన స్థలాలను పరిశీలించారు. గతంలో స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయకుండా అగ్రిమెంట్ల మీద వాటిని అప్పగించడంతో స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా మారిందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో వచ్చిన లొసుగులను వినియోగించుకుని స్థలాలను పొందుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం 40 ఎకరాలలో లేఅవుట్‌ స్థలాలు ఇవ్వకుండానే కుంటల లెక్కన అమ్ముతున్నారని ఆరోపించారు. వీపీఆర్‌ వెంచర్‌లో 2వేల గజాలు, పద్మశాలి భవన్‌ పక్కన 2445 గజాలు, సాయిబాబా టాకీస్‌ రహదారిలో 5510 గజాలు, శ్రీలక్ష్మి టాకీస్‌ పక్కన వెయ్యి గజాల స్థలాల పత్రాలు లేకపోవడంతో వాటిని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలన్నారు. ఫోర్జరీ కేసులో చర్యలు తీసుకోలేదన్నారు. ఈనెల 30న పురపాలిక కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి నాగన్నగౌడ్‌, కౌన్సిలర్లు కస్తాల శ్రావణ్‌కుమార్‌, కోతి సంపత్‌రెడ్డి, తేజావత్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని