logo

కస్తూర్బాలో కష్టాలు

వేడి నీటిని అందించేందుకు కస్తూర్బా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంట్లు ఏళ్ల తరబడి పనిచేయక విద్యార్థినులు చలికాలంలో ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ ఏడాది శీతాకాలానికి ముందుగానే అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు

Published : 30 Sep 2022 04:43 IST

అలంకారప్రాయంగా సౌర వేడినీటి ప్లాంట్లు


మిర్యాలగూడలో వృథాగా ఉన్న సోలార్‌ ప్లాంటు

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: వేడి నీటిని అందించేందుకు కస్తూర్బా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంట్లు ఏళ్ల తరబడి పనిచేయక విద్యార్థినులు చలికాలంలో ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ ఏడాది శీతాకాలానికి ముందుగానే అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థినులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 56 కస్తూర్బా బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో ఆరు నుంచి పది తరగతుల వరకు 200 మంది విద్యార్థినులకు ప్రభుత్వం వసతి కల్పించింది. ఇటీవల పదికి పైగా పాఠశాలల్లో జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయగా అదనంగా విద్యార్థినులు ఇందులో చేరుతున్నారు. నల్గొండ జిల్లాలో 27, సూర్యాపేటలో 18, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు ఏడు వందల మందికి పైగా విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు.

మరమ్మతులేవి?

2015లో ఆయా పాఠశాలల్లో చలికాలంలో వేడినీటిని అందించేందుకు సౌర వేడినీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లు ఆరునెలల పాటు పనిచేశాయి. ఆ తరువాత ఏడాది నుంచి పనిచేయడంలేదు. వీటిని ఓ ప్రైవేటు ఏజన్సీకి అప్పగించి ఏర్పాటు చేశారు. వారు మరమ్మతుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. పాఠశాల ప్రత్యేకాధికారులు ఆయా ఏజన్సీల వారికి మరమ్మతుల గురించి సమాచారం అందించినా వారు స్పందించడం లేదు. దీంతో ఏళ్ల తరబడి ప్లాంట్లు నిరుపయోగంగా మారిపోయాయి. ఈ ఏడాదైనా చలికాలంలో వేడి నీటిని అందించాలని విద్యార్థినులు కోరుతున్నారు. అధికారులు స్పందించి పాఠశాలలు ప్రారంభించేలోగా ప్లాంట్లకు మరమ్మతులు చేయించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు వేడుకొంటున్నారు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం
- బి.భిక్షపతి, డీఈవో, నల్గొండ

ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించేలా చూస్తాం. సంబంధిత ఏజన్సీకి సమాచారం ఇచ్చి పనిచేయించేందుకు ప్రయత్నిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని