logo

క్షణికావేశ నేరాలతో కుటుంబాలు విచ్ఛిన్నం

శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు వి.బాలభాస్కర్‌రావు అన్నారు.

Updated : 03 Oct 2022 06:16 IST


న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌రావు,
చిత్రంలో జైలు పర్యవేక్షణాధికారి పూర్ణచందర్‌

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు వి.బాలభాస్కర్‌రావు అన్నారు. ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జైలులో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు.క్షణికావేశంలో చేసిన నేరంతో తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని సూచించారు. ఖైదీలకు నిర్వహించిన వ్యాసరచన, క్యారమ్స్‌ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో జైలు పర్యవేక్షణాధికారి పూర్ణచందర్‌డాక్టర్‌ మురళి, వయో వృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి జంపాల అంజయ్య పాల్గొన్నారు.

భువనగిరి పట్టణం: వయో వృద్ధుల సంక్షేమానికి చొరవ చూపుతామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బాలభాస్కర్‌రావు అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాయగిరిలోని సహృదయ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు.వృద్ధుల కుటుంబ నేపథ్యం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పథకాలు, న్యాయ సంబంధిత హక్కుల కల్పనకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాలేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి జంపాల అంజయ్య, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని