logo

పేదబంధు పథకం తెచ్చి నిరుపేదలను ఆదుకోండి: ఈటల

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు అప్పటి ప్రభుత్వం చేపట్టిన కృష్ణా జలాల సరఫరా పథకానికి సీఎం కేసీˆఆర్‌ మిషన్‌ భగీరథగా మెరుగులు దిద్ది తామే ప్లోరైడ్‌ నిర్మూలించినట్లు చెప్పుకుంటున్నారని భాజపా చేరికల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

Published : 05 Oct 2022 05:59 IST

నాంపల్లి: తిర్మలగిరిలో మాట్లాడుతున్న భాజపా చేరికల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

నాంపల్లి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు అప్పటి ప్రభుత్వం చేపట్టిన కృష్ణా జలాల సరఫరా పథకానికి సీఎం కేసీˆఆర్‌ మిషన్‌ భగీరథగా మెరుగులు దిద్ది తామే ప్లోరైడ్‌ నిర్మూలించినట్లు చెప్పుకుంటున్నారని భాజపా చేరికల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. మగళవారం నాంపల్లి మండలంలోని మాందాపురం, తుమ్మలపల్లి, తిర్మలగిరి గ్రామాలలో పర్యటించి వివిధ పార్టీలకు చెందిన నాయకులను భాజపాలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2012తె కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అప్పటి శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌ నల్గొండ జిల్లాలో పర్యటించి ఫ్లోరైడ్‌ నిర్మూలనకు కృష్ణా జలాల సరఫరా పథకానికి శ్రీకారం చుట్టారని, అదే పథకానికొ కొనసాగింపుగా కేసీఆర్‌ మిషన్‌ భగీరథగా మార్చారని తెలిపారు. పథకంపై అవగాహన లేని మంత్రి కేటీఆర్‌ ట్వీట్లతో విపక్షాలను విమర్శిస్తూ ఆనందిస్తున్నారని విమర్శించారు. దళితబంధు, గిరిజనబంధు పథకాలతో పాటు పేద బంధు పథకాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని వర్గాల నిరుపేదలకు ఆర్ధిక సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని ఆరోపించారు. మునుగోడులో భాజపా గెలిస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని కంఠోపాఠంగా తప్పుడు ప్రచారం చేస్తున్న తెరాస నాయకులు హుజూరాబాద్‌, దుబ్బాకలో మీటర్లు వచ్చాయేమో తెలుసుకోవాలన్నారు. మునుగోడు నియోజకవర్గం మాదిరిగానే రాష్ట్రంలోని గొల్లకుర్మలందరికీ ఉప ఎన్నికకు ముందే గొర్రెల పంపిణీ పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కేసీˆఆర్‌ ఎన్ని మోసపూరిత హామీలిచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేసినా మునుగోడులో పరాభవం తప్పదన్నారు. కార్యక్రమంలో మండల ఇన్‌ఛార్జిలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్‌, రాష్ట్ర నాయకులు ఎరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా నాయకులు రఘుపతిరెడ్డి, పూల వెంకటయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ జి.నర్సిరెడ్డి, భాజపా మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి శేఖర్‌, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు