logo

రహదారుల అభివృద్ధిని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం: సంకినేని

నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండలకేంద్రంలో భాజపా కార్యాలయాన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రామచంద్రయ్యతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు.

Published : 05 Oct 2022 05:59 IST

కుంటపల్లిలో కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానిస్తున్న భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు

మద్దిరాల, న్యూస్‌టుడే: నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండలకేంద్రంలో భాజపా కార్యాలయాన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రామచంద్రయ్యతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న తెరాస పాలకులు రహదారులను బాగుచేయడం లేదన్నారు. తరువాత పార్టీలకు చెందిన నాయకులు భాజపాలో చేరారు. నియోజకవర్గ కన్వీనర్‌ కాప రవి, పార్టీ తుంగతుర్తి, మద్దిరాల మండలాల అధ్యక్షులు మహేందర్‌, సాగర్‌, నాయకులు అచ్చయ్య, కిరణ్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

మద్దిరాల గ్రామీణం: రానున్న ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం కుంటపల్లిలో పలువురు ఆయన సమక్షంలో భాజపాలో చేరారు.కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కడియం రామచంద్రయ్య, కాపా రవి, మండల పార్టీ అధ్యక్షుడు భూతం సాగర్‌, జలగం అచ్చయ్య, బీసు వీరన్న, విజయ్‌ పాల్గొన్నారు.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని