logo

గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో  ఈనెల 16న నిర్వహించే గ్రూప్‌-1 పరీక్ష ఏర్పాట్లు, నిర్వహణపై పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సూచనలు చేశారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం జూమ్‌ సమావేశం ఏర్పాటు చేసి వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.

Published : 05 Oct 2022 05:59 IST

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, తదితరులు

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో  ఈనెల 16న నిర్వహించే గ్రూప్‌-1 పరీక్ష ఏర్పాట్లు, నిర్వహణపై పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి సూచనలు చేశారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం జూమ్‌ సమావేశం ఏర్పాటు చేసి వివిధ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. అనంతరం లైజన్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లతో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ సమావేశమయ్యారు. జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,181 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో రాజేంద్రకుమార్‌, సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, డీఐఈవో రుద్రంగి రవి పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో దసరా జరుపుకోవాలి... సూర్యాపేట కలెక్టరేట్‌: విజయ దశమి పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ మంగళవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. ప్రభుత్వ సూచనల మేరకు దసరా పండుగను అన్ని శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మను ఘనంగా నిర్వహించామన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని