logo

సాగర్‌ నుంచి 18 గేట్ల ద్వారా నీటివిడుదల

సాగర్‌ జలాశయానికి ఎగువనుంచి వస్తున్న వరదనీరు పెరగడంతో ఎన్నెస్పీ అధికారులు 18గేట్ల ద్వారానీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం రాత్రి 9గంటలకు శ్రీశైలం నుంచి 2,07,201 క్యూసెక్కుల

Published : 05 Oct 2022 05:59 IST

విడుదలవుతున్న నీరు

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: సాగర్‌ జలాశయానికి ఎగువనుంచి వస్తున్న వరదనీరు పెరగడంతో ఎన్నెస్పీ అధికారులు 18గేట్ల ద్వారానీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం రాత్రి 9గంటలకు శ్రీశైలం నుంచి 2,07,201 క్యూసెక్కుల వరదనీరు రాగా సాగర్‌ డ్యాం 18గేట్లను(16గేట్లు 5అడుగుల, 2గేట్లు 10అడుగులు)మేరకు ఎత్తి 1,59,626 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా జలాశయనీటిమట్టం 590.00(గరిష్ఠం 590.00) అడుగుల వద్ద ఉంది. సాగర్‌ కుడి, ఎడమకాల్వ, ప్రధాన విద్యుత్కేంద్రం, ఎస్‌ఎల్బీసీ, వరదకాల్వ, నీటి ఆవిరిగా మొత్తం 47,575 క్యూసెక్కుల నీటిని మొత్తంగా కలిపి 2,07,201 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా నీటి సామర్థ్యం 312.0450(గరిష్ఠం 312.0450) టీఎంసీల వద్ద ఉంది.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని