logo

అనుమతి లేకుండా సెలవు తీసుకోవద్దు

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినందున విధులు కేటాయింపు పొందిన ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేకుండా సెలవు తీసుకోవద్దని, తమ స్థానం వదిలి వెళ్లొద్దని నల్గొండ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి కోరారు.

Published : 05 Oct 2022 05:59 IST

ఉప ఎన్నికల పర్యవేక్షక బృందాలకు కలెక్టర్‌ సూచన 


చండూరులో ఎన్నికల బృందాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

చండూరు, న్యూస్‌టుడే: ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినందున విధులు కేటాయింపు పొందిన ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేకుండా సెలవు తీసుకోవద్దని, తమ స్థానం వదిలి వెళ్లొద్దని నల్గొండ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి కోరారు. చండూరులోని ఈవీఎంల భద్రత, పంపిణీ కేంద్రమైన డాన్‌బోస్కో జూనియర్‌ కళశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరూ తప్పనిసరిగా విధులు నిర్వర్తించి తీరాలన్నారు. బృందాల్లోని సభ్యులకు వారు చేయాల్సిన విధుల గురించి అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ వివరించారు. సభ్యులందరూ ఉన్నది లేనిది సరిచూశారు. సభ్యులు సరిపడా లేకపోతే వెంటనే సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని, అంతా సమన్వయంతో పనిచేయాలని ఈఆర్వో జగన్నాథరావు తెలిపారు. మొత్తం నాలుగు రకాల బృందాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాలకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) బృందాలు-6, సర్వే స్టాస్టిక్స్‌ టీం (ఎస్‌ఎస్‌ఎస్‌టీ)-6, ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌-7, వీడియో సర్వేలెన్స్‌ (వీఎస్‌టీ)-6 బృందాల చొప్పున ఏర్పాటు చేశారు. వీఎస్‌టీ బృందంలో తప్ప మిగిలిన బృందాలలో 12 గంటలకు ఒకరు చొప్పున ఇద్దరేసి అధికారులను కేటాయించారు. సమావేశంలో నల్గొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, నియోజకవర్గానికి చెందిన ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని