logo

విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం: డీటీఎఫ్‌

రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మునగాల సోమయ్య ఆరోపించారు. విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిస్తూ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టకుండా, నూతన నియామకాలు చేయకుండా,

Published : 05 Oct 2022 06:12 IST

సమావేశంలో మాట్లాడుతున్న డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మునగాల సోమయ్య

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మునగాల సోమయ్య ఆరోపించారు. విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు తగ్గిస్తూ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టకుండా, నూతన నియామకాలు చేయకుండా, స్కావెంజర్లను తొలగిస్తూ ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యేలా వ్యవహరిస్తుందని తెలిపారు. మంగళవారం నల్గొండలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన డీటీఎఫ్‌ నల్గొండ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అందరికి సమాన విద్యావకాశాలు కల్పించే కామన్‌స్కూల్‌ విధానాన్ని సాధించడమే డీటీఎఫ్‌ లక్ష్యమని తెలిపారు. డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ.ఖుర్షీద్‌మియా అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి పి.వెంకులు, జిల్లా కమిటీ సభ్యులు నగేశ్‌, వెంకటేశం, నాగయ్య, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, వెంకటేశం, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని