logo

గ్రంథాలయాల బలోపేతానికి కృషి

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రంథాలయాలకు వచ్చే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అసరమైన చోట అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు.

Published : 05 Oct 2022 06:12 IST

ఛైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి


నల్గొండ గ్రంథాలయంలో మల్లికార్జున్‌రెడ్డి

నీలగిరి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రంథాలయాలకు వచ్చే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అసరమైన చోట అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. సోమవారం గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రంథాలయంలో వసతులు కల్పిస్తూ, పాఠకులకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసి అందిస్తున్నామన్నారు. పాఠ్య పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. నిరుద్యోగులు గ్రంథాలయంలోనే రోజంతా చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. గ్రంథాలయాల్లో సమస్యలు పరిస్కరించడానికి మంత్రితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, దాతల సహాయ సహకారం తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల నుంచి వచ్చే సెస్‌ ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందరి సహకారంతో సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో పాలక మండలి సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు