logo

అవినీతి సొమ్ముతోనే సొంత విమానం!

లిక్కర్‌ స్కాంలో ముందు వరుసలో ఉన్న కూతురును కాపాడుకోవడం కోసం, ఇన్నేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్ము బయటకు వస్తుందనే భయంతో భారాస పేరుతో సీఎం కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారని భాజపా మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు.

Updated : 07 Oct 2022 12:27 IST

భాజపా ఉప ఎన్నిక స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి

మునుగోడులో మాట్లాడుతున్న వివేక్‌ వెంకటస్వామి, పక్కన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తదితరులు

మునుగోడు, న్యూస్‌టుడే: లిక్కర్‌ స్కాంలో ముందు వరుసలో ఉన్న కూతురును కాపాడుకోవడం కోసం, ఇన్నేళ్లలో సంపాదించిన అవినీతి సొమ్ము బయటకు వస్తుందనే భయంతో భారాస పేరుతో సీఎం కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారని భాజపా మునుగోడు ఉప ఎన్నిక ఇన్‌ఛార్జి, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. నల్గొండ జిల్లా మునుగోడులో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ నిర్ణయాలన్నీ కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా ఉంటాయని విమర్శించారు. తుగ్లక్‌ తరహా ఆలోచనల వల్లనే రాష్ట్రం అవినీతిలో మొదటి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతోనే కేసీఆర్‌ పార్టీకి సొంత విమానం కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. 24 గంటలు ఫాంహౌస్‌లో ఉంటూ రాష్ట్రాన్ని పరిపాలించలేని వ్యక్తి దేశాన్నేమి ఉద్దరిస్తారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళించేందుకు భారాసను తెరపైకి తెచ్చారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేస్తే అంతిమ ఓటమి అవుతుందని, భారాస నుంచి పోటీ చేస్తే ప్రజల చేతిలో తొలి ఓటమి నమోదవుతుందన్నారు. ఈ ఉప ఎన్నికల్లో భారాస నుంచి కేసీఆర్‌ పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. సంక్షేమ పథకాల ఆశచూపి గొల్ల, కుర్మలకు గొర్రెల యూనిట్‌ పేరుతో ఖాతాలో నగదు జమచేసి.. తీరా ఫ్రీజ్‌ చేశారని విమర్శించారు. డ్రామా కంపెనీలు, అవినీతి సొమ్ముతో మండలానికి ఇద్దరు మంత్రులు, రెండు ఊళ్లకు ఒక ఎమ్మెల్యేను కౌరవ సైన్యంతో దింపి హడావుడి చేసేందుకు కుట్రలు చేస్తున్న తెరాసకు మునుగోడు ప్రజలు ఓటుతో సరైన తీర్పు ఇస్తారన్నారు.  

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని